హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ షాపింగ్ మాల్ తమ 31 వ షోరూమ్‌ను హైదరాబాద్‌లోని భెల్ సర్కిల్‌లో ఏర్పాటు చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా బుధవారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. ఎంబీసీ చైర్మన్ జైపాల్ రెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ కట్టా శ్రీనివాస గౌడ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎంఆర్ ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ, తమ సంస్థను తెలుగు ప్రజలు గత 40 ఏళ్లుగా ఆదరిస్తున్నారని, తమ 31 వ షోరూమ్‌ను భెల్ సర్కిల్‌లో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని అన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో వరల్డ్ క్లాస్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చని చెప్పారు. అన్ని రకాల వేడుకలకు సరిపోయే దుస్తులను తమ దగ్గర కొనుగోలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. తక్కువ ధరకే లేటెస్ట్ మోడల్స్‌ను అందుబాటులో ఉంచామని, తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను అందుబాటు ధరల్లో అమ్ముతున్నామని వెంకటరమణ వివరించారు.
సీఎంఆర్ అంటే ఫ్యామిలీ మొత్తం షాపింగ్ చేసుకోగలిగే వన్ స్టాప్ అని సీఎంఆర్ షాపింగ్ మాల్ ఎండీ మావూరి బాలాజీ పేర్కొన్నారు. ఫ్యామిలీ మెంబర్లందరికీ నచ్చేలా వెరైటీలు, లేటెస్ట్ డిజైన్లు తమ దగ్గర లభిస్తాయని అన్నారు. తమ దగ్గర లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు ఉన్నాయని చెప్పారు. ఈ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవంలో సినీ హీరో పోతినేని రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గత 40 ఏళ్లుగా వస్త్ర వ్యాపారంలో క్వాలిటీకి, డిజైన్లకు సీఎంఆర్ షాపింగ్‌మాల్ కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందన్నారు.
