యోగా వేడుకల్లో ఆసనాలేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

యోగా వేడుకల్లో ఆసనాలేసిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు

నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఆసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. యోగా ఫర్ హ్యుమానిటీ అనే నినాదంతో ఈ ఏడాది యోగా ఉత్సవాలకు పిలుపునివ్వడంతో.. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం యోగా వేడుకల్లో పాల్గొంటున్నారు. వీరిలో ముఖ్యంగా అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ, హర్యానా ముఖ్యమంత్రి ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం థాకూర్, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేశ్ భగేల్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో పాటు మరికొందరు రాష్ట్ర సీఎంలు యోగా డే పాల్గొని, వివిధ ఆసనాలు వేశారు.