నోవార్టిస్‌‌ను కొననున్న డా.రెడ్డీస్​?

నోవార్టిస్‌‌ను కొననున్న డా.రెడ్డీస్​?

న్యూఢిల్లీ : హైదరాబాద్ ఫార్మా కంపెనీ డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌   నోవార్టిస్‌‌‌‌‌‌‌‌ ఏజీ  ఇండియా బిజినెస్‌‌‌‌‌‌‌‌ను కొనాలని చూస్తోందని  సీఎన్‌‌‌‌‌‌‌‌బీసీఎ టీవీ 18 రిపోర్ట్ చేసింది. స్విస్‌‌‌‌‌‌‌‌ కంపెనీ అయిన నోవార్టిస్‌‌‌‌‌‌‌‌ ఏజీ తన  సబ్సిడరీ నోవర్టిస్ ఇండియాలోని 70.68 శాతం వాటాను అమ్మాలని ప్లాన్ చేస్తోంది.  ‘నోవార్టిస్ ఏజీ  ఈ నెల 16 న స్ట్రాటజిక్ రివ్యూ చేసింది. ఇందులో ఇండియన్ సబ్సిడరీలోని 70.68 శాతం వాటాపై కూడా చర్చలు జరిగాయి. కానీ, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’ అని నోవార్టిస్ ఇండియా పేర్కొంది. 

కాగా, నోవార్టిస్‌‌‌‌‌‌‌‌ కిందటేడాది ఫిబ్రవరిలో తన డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌, సేల్స్‌‌‌‌‌‌‌‌ రైట్స్‌‌‌‌‌‌‌‌ను డా.రెడ్డీస్‌‌‌‌‌‌‌‌కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసింది. వోవెరన్ రేంజ్‌‌‌‌‌‌‌‌, కాల్షియం రేంజ్‌‌‌‌‌‌‌‌, మెథర్జిన్‌‌‌‌‌‌‌‌ వంటి మెడిసిన్స్‌‌‌‌‌‌‌‌  సేల్స్‌‌‌‌‌‌‌‌, డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌‌‌‌‌‌‌‌ కూడా ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసింది.  దీంతో నోవార్టిస్ ఇండియా అప్పుడు 400 మంది ఉద్యోగులను తీసేసింది.  ఈ కంపెనీకి ప్రస్తుతం  8,100 మంది ఉద్యోగులు ఉన్నారు.  కంపెనీ రెవెన్యూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–డిసెంబర్ మధ్య రూ.378.7 కోట్లు. మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,556.61 కోట్లు. కంపెనీ షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో 14 శాతం పెరిగి రూ.1,035 దగ్గర క్లోజయ్యాయి.