సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్​కు కోల్​ ఇండియా ప్రయోజనాలు వర్తింపజేయాలె

సింగరేణి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్​కు కోల్​ ఇండియా ప్రయోజనాలు వర్తింపజేయాలె
  • రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మికులు ఉండరని మాట తప్పిన కేసీఆర్
  • బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి

నస్పూర్/మందమర్రి, వెలుగు: సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్  చేసి కోలిండియాలో అమలు చేస్తున్న హైపవర్ ​కమిటీ వేతనాలను ఇవ్వాలని బీజేపీ నేషనల్​ఎగ్జిక్యూటివ్​కమిటీ మెంబర్, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి డిమాండ్​ చేశారు. తెలంగాణలో కాంట్రాక్ట్​ కార్మికులు ఉండరని చెప్పిన సీఎం కేసీఆర్​మాట తప్పారని దుయ్యబట్టారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​ సింగరేణి జీఎం ఆఫీస్​ ఎదుట కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్ ​కార్మికులను రెగ్యులరైజ్​ చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​రఘునాథ్​ వెరబెల్లి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. దీనికి ముఖ్యఅతిథిగా వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. బోర్డ్​ఆఫ్ ​ఇండస్ట్రియల్ ​అండ్​ఫైనాన్షియల్ ​రీకన్​స్ట్రక్షన్ ​(బీఐఎఫ్ఆర్) లిస్ట్ లో ఉన్న సింగరేణికి ఎన్టీపీసీ నుంచి రూ. 400 కోట్ల లోన్​ ఇప్పించి లక్ష మంది కార్మిక కుటుంబాలను తన తండ్రి వెంకటస్వామి కాపాడారని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం టైంలో కాంట్రాక్ట్​ కార్మికులు ఇక ఉండరని కేసీఆర్ మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పడమే కాకుండా సంస్థ ఫండ్స్ ​దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సీఎస్సార్ ​ఫండ్స్​ను సిద్దిపేటలో ఫుట్​బాల్ ​స్టేడియానికి తరలించారన్నారు.   
సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదు
సింగరేణిని ప్రైవేట్ చేసే ఆలోచన కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి స్పష్టంగా చెప్పారని,  కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తోందని వివేక్ ​వెంకటస్వామి ఆరోపించారు. తాడిచెర్ల మైన్స్​ను కేసీఆర్​ సర్కార్​ ప్రైవేటుపరం చేసిందని, సింగరేణిలో కాంట్రాక్టు పనులను మెల్లమెల్లగా అమలు చేస్తోందన్నారు.  బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​రఘునాథ్ ​వెరబెల్లి మాట్లాడుతూ.. కోలిండియా బెనిఫిట్స్​ను సింగరేణిలో వర్తింపజేస్తూ కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్​చేశారు. 
జీఎం ఆఫీస్​ఎదుట ఉద్రిక్తత
దీక్ష అనంతరం శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి జీఎం సురేశ్​కు వినతిపత్రం అందించేందుకు వెళ్లగా జిల్లా ప్రెసిడెంట్, లీడర్లను గేటు వద్ద పోలీసులు, సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరకు రఘునాథ్ తోపాటు కొంతమంది కాంట్రాక్టు కార్మికులు వెళ్లి జీఎంకు వినతిపత్రం అందజేశారు. దీక్షలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్ అగల్​డ్యూటీ రాజు, లీడర్లు పానుగంటి రంగారావు, మునిమంద రమేశ్, తుల మధుసూదన్, బీఎంఎస్​ వైస్​ ప్రెసిడెంట్​బరుపాటి మారుతీ తదితరులు పాల్గొన్నారు.