కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి కంపెనీ లెవల్ కల్చరల్మీట్ పోటీలు బుధవారం మంచిర్యాల జిల్లా మందమర్రి టౌన్ సీఈఆర్‌క్లబ్‌లో ఉత్సాహంగా ముగిశాయి. 6 జిల్లాల్లోని11 ఏరియాలకు నుంచి 220 మంది కళాకారులు హాజరై ప్రదర్శనలు ఇవ్వగా అలరించాయి. ఫోక్ డ్యాన్స్‌లో ఎన్.శ్రీనివాస్ టీం(మందమర్రి, బెల్లంపల్లి ఏరియాలు) ప్రథమ, అడిచెర్ల శ్రీనివాస్ టీం(రామగుండం–3, భూపాలపల్లి) రెండో, కవ్వాలి గ్రూప్ విభాగంలో ప్రథమ జలపతి టీం(రామగుండం1,2 ఏరియాలు), ద్వితీయ బి.కుమారస్వామి టీం (రామగుండం3,భూపాలపల్లి), ఆర్కెస్ర్టా విభాగంలో ఎస్.డేవిడ్‌రాజ్ టీం(మణుగూరు,ఇల్లందు) ప్రథమ , ఆర్.నోవాశ్యాం టీం(రామగుండం1,2) రెండో స్థానంలో నిలిచాయి.
భజన విభాగంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో సీహెచ్.శంకర్,కె.శంకరయ్య, లైట్‌మ్యూజిక్ లో దార సుశీల, కె.శ్రీనివాస్,కీర్తన అంశంలో పవన్‌కుమార్,శివకుమార్, ఫోక్‌సాంగ్‌లో నారాయణ,ప్రభాకర్,గజల్ విభాగంలో కె.శ్రీనివాస్,బి.రాకేశ్,కర్నాటక సంగీతంలో శ్రీనిధి,పవన్‌కుమార్,గీత్ అంశంలో జంపయ్య, కార్తీక్, ఫ్లూట్‌లో రవీంద్రకుమార్,రామారావు, తబలా విభాగంలో అనిల్‌కుమార్,జె.శ్రీనివాస్,గీటార్లో దుర్గాకోటి,శ్యాంసన్, మౌత్ ఆర్గన్ అంశంలో ఆదిల్మహ్మమద్, వీపీ రావు, వయోలిన్ విభాగంలో రవికుమార్, సంపత్, బంజో అంశంలో ఎస్.ప్రభాకర్, పి.శంకర్, సింథసిజర్లో పి.ఏసోబు, నోవా శ్యాం, కూచిపూడి విభాగంలో శ్రీనివాస్, తాంబిరాజ్, భరత నాట్యంలో శ్రీకాంత్, తాంబిరాజ్, హ్యుమరస్ స్కిట్లో ప్రథమస్థానం వేమనచారి, రెండో స్థానంలో వాసాల రమేశ్ నిలిచారు.
సింగరేణి కంపెనీ లెవల్ కల్చరల్ మీట్లో ఆయా అంశాల్లో ప్రథమస్థానంలో నిలిచిన కార్మిక,ఉద్యోగ కళకారులు,గ్రూపు మెంబర్లు కోలిండియా పోటీలకు ఎంపికయ్యారని, నెల 25 నుంచి 27 వరకు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో వెస్ర్టన్ కోల్‌ఫీల్డ్స్ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో వీరు పాల్గొంటారని సింగరేణి యాజమాన్యం పేర్కొంది.
బహుమతుల ప్రదానోత్సవానికి మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్,సింగరేణి గుర్తింపు సంఘం కార్మిక సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ,సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేశ్,క్రీడల గౌరవ కార్యదర్శి కార్తీక్,సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.
