జెన్ Z.. వీళ్ల బుర్రకు ఎక్కటమే ఆలస్యం.. ఎక్కించుకోవటం కొంచెం కష్టం.. అలా కాకుండా జెన్ Z కుర్రోళ్ల బుర్రకు ఏమైనా ఎక్కిందా ఇక దానికి అంతే లేదు.. అడ్డేలేదు. నిరుద్యోగులు బొద్దింకలు.. పరాన్నజీవులు.. బద్దకస్తులు.. ఉద్యోగం సజ్యోగం లేకుండా మీడియా అని.. సోషల్ మీడియా అని.. RTI కార్యకర్తలు అంటూ అవహేళన వ్యాఖ్యలకు ఇప్పుడు కదం తొక్కుతున్నారు. బొద్దింకల జనతా పార్టీ అంటూ నాలుగు అంటే నాలుగు రోజుల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఇన్ స్టా పార్టీకి.. ఫాలోవర్స్ కెవ్వు కేకగా దుమ్మురేపుకుంటూ వెళుతుంది.
కేంద్రంలో అధికార బీజేపీకి ఇన్ స్టాలో 8.7 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే.. జస్ట్ నాలుగు అంటే నాలుగు రోజుల క్రితం పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీకి ఇప్పుడు 10 మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చారు. 40 ఏళ్ల బీజేపీ పార్టీ 10 ఏళ్లు సోషల్ మీడియాలో తెచ్చుకున్న ఫాలోవర్స్ ను.. బొద్దింకల పార్టీ నాలుగు రోజుల్లోనే బీట్ చేయటం ఇప్పుడు సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ అయ్యింది. ఫాలోవర్స్ గంట గంటకు అంత కంతకూ పెరుగుతూనే ఉన్నారు..
స్థాపించిన నాలుగు రోజుల్లోనే బొద్దింకల పార్టీ ఈ రేంజ్ లో జనాదరణ పొందడం హాట్ టాపిక్ గా మారింది. ఒక వ్యక్తి ఆగ్రహం నుండి పుట్టిన ఈ ఆన్ లైన్ వ్యంగ్య పార్టీ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిందని చెప్పాలి. దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీతో పోటీ పది అందరి దృష్టిని ఆకర్షించింది. బొద్దింకల పార్టీ స్పీడ్ చూస్తోంటే ఇండియాలో కూడా జెన్ జీ విప్లవం రాబోతోందా అనిపిస్తోంది.
ఇంస్టాగ్రామ్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ సాధించిన క్రమంలో ఆసక్తికర పోస్ట్ చేసింది బొద్దింకల పార్టీ. " కేవలం 4 రోజులే పట్టింది.. యువత శక్తిని తక్కువ అంచనా వేయకండి.." అంటూ క్యాప్షన్ తో పోస్ట్ షేర్ చేసింది పార్టీ.
World’s largest party they said🤭 pic.twitter.com/Yogr9Ig0GM
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 20, 2026
పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఎక్స్ వేదికగా బీజేపీని టార్గెట్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు. " ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని వారన్నారు.." అంటూ సెటైరికల్ గా ట్వీట్ చేశారు అభిజీత్.
