
సూర్యాపేట, వెలుగు:- ఏలూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న కొబ్బరిబొండాల డీసీఎం సూర్యాపేట మండలం రాయనగూడెం వద్ద ముందు వెళుతున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ యాక్సిడెంట్‌లో డ్రైవర్ వెంకటరమణకు గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోగా.. అతడిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.
అటుగా వెళ్తున్న వాహనదారులు లారీలో ఉన్న దాదాపు రూ. 2 లక్షల విలువైన కొబ్బరిబొండాలను ఎత్తుకెళ్లారు. బండ్లు, కార్లపై వెళ్లేవారు, కొందరైతు సంచుల్లో నింపుకుని కొబ్బరి బొండాలను తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం లారీ వద్దకు వచ్చిన డ్రైవర్ కు కొబ్బరి బొండాలు కనిపించపోవడంతో ఆశ్చర్యపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.