
మారుతున్న జీవన శైలితో పాటు ఆహార అలవాట్లలోనూ మార్పులు వస్తున్నాయి. ఆహారాన్ని వండేందుకు ఉపయోగించే నూనెకు చాలా ప్రాముఖ్యత ఉందని గుర్తించడం ముఖ్యం. మార్కెట్లో ఎన్నో రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మంచివేవో తెలుసుకుని తీసుకోవడం ముఖ్యం. ఆరోగ్యవంతమైన నూనెల లిస్ట్‌లో కొబ్బరి నూనె, ఆలివ్ఆయిల్ టాప్ ప్లేస్‌లో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ని కేరళ తదితర ప్రాంతాల్లో వంటల్లో కొబ్బరి నూనెను వినియోగిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో ఈ రెండింటిలో ఏది మంచిదనే విషయాన్ని చూద్దాం..
1. కొబ్బరి నూనె: కొబ్బరి నూనె ఎక్కువగా శాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉంటుంది. శరీరంలో ఖర్చైన కేలరీల సంఖ్యను పెంచడానికి ఈ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. దీనిని 350 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు వేడి చేయవచ్చు. ఈ నూనెలో కనిపించే కొవ్వు ఆమ్లం లారిక్ యాసిడ్. ఇందులో యాంటీ బ్యాక్టరీయల్ గుణాలున్నాయి. ఇది వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడుతుంది.
2. ఆలివ్ ఆయిల్: ఆలివ్ ఆయిల్ చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరానికి విటమిన్ 'ఈ' అందించడానికి, ఎముకల సాంద్రత పెంచడానికి, కణాలను రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి. దీనిని 280 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు మాత్రమే వేడి చేయవచ్చు. యాంటిఆక్సిడెంట్లు సైతం ఆలివ్ ఆయిల్లో పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరి నూనెతో పోల్చితే ఎక్కువ బెనిఫిట్స్ ఉన్న ఆలివ్ ఆయిలే వంటగదిలో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు.