కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీళ్లు

కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీళ్లు

కిడ్నీలను శుభ్రం చేయడానికి కొబ్బరి నీళ్లను మించిన ఆప్షన్ లేదు. మూత్రపిండాల పనితీరును మెరుగుపరచాలనుకుంటే, క్రమం తప్పకుండా కొబ్బరి నీటిని తాగాలని సైన్స్ చెబుతోంది.

మూత్రపిండాలకు కొబ్బరి నీరు: సిరలు, రక్త నాళాల్లోని మురికిని బయటకు పంపడంలో కిడ్నీ సహాయపడుతుంది. ఇది శరీరంలోని అనేక ఎలక్ట్రోలైట్‌లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలోని అన్ని భాగాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కానీ, కిడ్నీలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్లు, యూరియా చేరడం వల్ల సమస్యలు మొదలవుతాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు కిడ్నీని శుభ్రపరచడం, అందుకు కొబ్బరి నీళ్ళు తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కిడ్నీలో రాళ్ల నివారణకు కొబ్బరి నీరు ఎలా సహాయపడుతుంది?

కిడ్నీలను శుభ్రం చేయడానికి కొబ్బరి నీళ్లను మించిన ఆప్షన్ లేదు. మీరు మీ మూత్రపిండాల పనితీరును మెరుగుపరచాలనుకుంటే, తప్పకుండా కొబ్బరి నీటిని తాగాలని సైన్స్ సూచిస్తుంది. ఇది మూత్రంలో పొటాషియం, క్లోరైడ్, సిట్రేట్ విసర్జనను పెంచుతుంది. వాటిని శరీరంలో పేరుకుపోనివ్వకుండా సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య రాకుండా చేస్తుంది.

క్రియాటినైన్ ఆరోగ్యానికి..

క్రియాటినైన్ మొత్తాన్ని తగ్గించడంలో కొబ్బరి నీరు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది క్రియేటినైన్ స్థాయిని తగ్గిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. దాంతో పాటు అధిక మొత్తంలో పొటాషియం కలిగి ఉన్న కొబ్బరి నీరు, కిడ్నీలో రక్త ప్రసరణను సరిదిద్ది, దాని పనితీరును మెరుగుపరుస్తుంది, కిడ్నీని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడానికి కొబ్బరి నీటిని తీసుకోవడం ఉత్తమం.