వెల్ నెస్ సెంటర్ లాంచ్ చేసిన సారా టెండూల్కర్.. ఎక్స్ లో సచిన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

వెల్ నెస్ సెంటర్ లాంచ్ చేసిన సారా టెండూల్కర్.. ఎక్స్ లో సచిన్ ఇంట్రస్టింగ్ ట్వీట్..

క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూతురు సారా టెండూల్కర్ ఫిట్ నెస్ రంగంలోకి అడుగు పెట్టారు. పిలాటిస్ అకాడమీ పేరుతో వెల్ నెస్ సెంటర్ లాంచ్ చేశారు సారా. పిలాటిస్ స్టూడియోను లాంచ్ చేయడం ద్వారా సారా తన వెల్ నెస్ ప్రయాణంలో బిగ్ స్టెప్ వేశారు. 27 ఏళ్ల సారా చాలా కాలంగా హెల్త్, వెల్నెస్ పట్ల ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త వెంచర్ లాంచ్ చేయడంతో ఆమె పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో కొత్త మైల్ స్టోన్ రీచ్ అయ్యారని చెప్పాలి. శుక్రవారం ( ఆగస్టు 22 ) జరిగిన లాంచింగ్ ప్రోగ్రాంకి సంబంధించిన ఫోటోలు ఎక్స్ వేదికగా షేర్ చేశారు సచిన్. ఈ మేరకు ఎమోషనల్ ట్వీట్ షేర్ చేశారు సచిన్.

ఈ స్టూడియో లాంచ్ ప్రోగ్రాంలో సచిన్ ఫ్యామిలీ సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సచిన్. ఒక తండ్రిగా.. పిల్లలు ఇష్టపడే రంగంలో సెటిల్ అవ్వాలని అందరూ కోర్చుకుంటారని... సారా పైలేట్స్ స్టూడియోను లాంచ్ చేయడం తనకు హార్ట్ టచింగ్ మూమెంట్ అని రాసుకొచ్చారు సచిన్.

►ALSO READ | US Open 2025: యుఎస్ ఓపెన్ డ్రా రిలీజ్.. అందరి చూపు ఆ ముగ్గురిపైనే.. తొలి రౌండ్‌లోనే జొకోవిచ్‌కు టఫ్ ఫైట్

సారా తన సొంత కృషి, నమ్మకంతో, ఇటుక ఇటుకగా ఈ ప్రయాణాన్ని నిర్మించిందని... న్యూట్రిషన్, వెల్ నెస్ మన జీవితాల్లో ముఖ్యమైనవని... ఈ రంగంలో సారా ముందుకెళ్లడం తనకు ఎంతో స్పెషల్ మూమెంట్ అని అన్నారు సచిన్. ఒక తండ్రిగా ఇంతకంటే ప్రౌడ్ మూమెంట్ ఏముంటుంది.., సారా జర్నీకి వెస్ట్ విషెస్ అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు సచిన్.