
భారత అంతరిక్ష రంగంలో మరో మైల్ స్టోన్ కు చేరేందుకు సిద్ధమైంది ఇండియా. త్వరలో ఏర్పాటు చేయనున్న అంతరిక్ష కేంద్రానికి సంబంధించిన మోడల్ ను విడుదల చేసింది ఇస్రో. నేషనల్ స్పేస్ డే సెమినార్ లో భాగంగా శుక్రవారం (ఆగస్టు 22) భారతీయ అంతరిక్ష కేంద్రం (Bharatiya Antariksh Station (BAS)) నమూనాను విడుదల చేసింది ఇస్రో.
ఇండియాకు ఇప్పటి వరకు ఆర్బిటల్ ల్యాబొరేటరీస్ లేవు. ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS), చైనాకు సంబంధించిన త్యాంగాంగ్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. ISS ఐదు స్పేస్ ఏజెన్సీల సంయుక్త సంస్థ. భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుతో మూడో స్థానంలోకి చేరనుంది ఇండియా.
భారత మొట్టమొదటి మాడ్యూల్ BAS - 01 ను 2028 వరకు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. 2035 వరకు ఐదు మాడ్యూల్స్ గా విస్తరించాలని ప్లాన్ చేస్తోంది.
BAS - 01 విశేషాలు:
BAS - 01 మాడ్యూల్ 10 టన్నుల బరువు మోసే సామర్థ్యం కలిగి ఉంటుంది. 450 కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో తిరుగుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, లైఫ్ సప్పోర్ట్ సిస్టం ((ECLSS) కలిగి ఉంటుందని ఇస్రో పేర్కొంది. దీంతో పాటు భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్ సిస్టం ను కలిగి ఉంటుందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు.
►ALSO READ | 7,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రియల్మీ పీ సిరీస్ఫోన్లు
మైక్రోగ్రావిటీ రీసెర్చ్, టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ (సాంకేతిక ప్రదర్శనలు), సైంటిఫిక్ ఇమేజింగ్.. అంటే రీసెర్చ్ కోసం వ్యూహాత్మక ప్రదేశాల నుంచి క్యాప్చర్ చేయడం వంటి ఫీచర్స్ కలిగి ఉందని తెలిపారు. ఇంధనం రీఫిల్ చేయడంలో, రేడియేషన్, థర్మల్ ఎఫెక్ట్, వివిధ కక్ష్యల్లో ఉన్న చిన్న చిన్న శకలాలను తట్టుకుని పనిచేస్తుంది.
స్పేస్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మెడిసిన్, వివిధ గ్రహాల మధ్య పరిశోధనల విషయంలో ఈ మాడ్యూల్ తోడ్పడుతుంది. మానవ ఆరోగ్యానికి మైక్రో గ్రావిటీ (సూక్ష్మ ఆకర్షణ), దీర్ఘకాలిక స్పేస్ మిషన్స్ కు సంబంధించి ఎంతగానో తోడ్పడుతుందని సైంటిస్టులు చెబుతున్నారు.