ఐదేళ్ల క్రితం గోదావరిఖనిలో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో తీర్పు వెలువరించింది పెద్దపల్లి జిల్లా కోర్టు. ఈ కేసులో వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. శుక్రవారం (ఆగస్టు 22) గోదావరిఖనికి చెందిన షేక్ సర్వర్ అనే వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు పెద్దపల్లి జిల్లా కోర్టు జడ్జి కె.సునీత.
గోదావరిఖని గాంధీనగర్ లోని గాంధీ పార్క్ స్కూల్ లో స్వీపర్ గా పనిచేసే షేక్ సర్వర్.. అదే స్కూల్ లో చదువుతున్న బాలికపై 2019లో అత్యాచారయత్నం చేశాడు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి గోదావరిఖని వన్ టౌన్ సీఐ పర్శ రమేష్ కేసు నమోదు చేశారు. కేసును పరిశోధించి నిందితుడిని జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు.
►ALSO READ | అసిఫాబాద్ జిల్లాలో పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం.. భారీగా ఎగసిపడిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం
ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నేరం చేసినట్టు రుజువు కావడంతో తీర్పు వెలువరించింది. నిందుతుడికి జైలు శిక్ష తో పాటు జరిమానా విధిస్తూ జడ్జి సునీతతీర్పు వెలువరించినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
