
కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. మంటలు భారీగా ఎగసి పడటంతో సిబ్బంది, వాహన దారులు పరుగులు తీశారు.
శుక్రవారం (ఆగస్టు 22) సాయంత్రం జరిగింది ఈ ఇన్సిడెంట్. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అదిలాబాద్ ఎక్స్ రోడ్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్టోర్ రూమ్ నుంచి మంటలు ఎగసి పడటంతో పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చునని ఆందోళన చెందారు.
►ALSO READ | స్కెచ్ వేసి.. స్క్రిప్ట్ రాసి.. టెన్త్ క్లాసులోనే ఇంత క్రిమినల్ బ్రెయినా : సహస్ర కేసులో ఊహించని క్రైం కథ
మంటలు బంకుకు అంటుకుంటే పేలి పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు.