‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్ లాంచ్

‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్ లాంచ్

ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్ కాస్త గ్యాప్ తీసుకొని మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఆయన దర్శకత్వంలో.. ది బెస్ట్ క్రియేషన్, సెవెన్‌ హిల్స్ ప్రొడక్షన్స్ పతాకాలపై సెవెన్‌హిల్స్ సతీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘కాఫీ విత్ ఎ కిల్లర్’. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించి.. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

అనంతరం అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘కరోనా ప్యాండమిక్ తరువాత రీ రిలీజులు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అదరగొడుతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ ఉన్న సినిమాలకే ఎక్కువ స్కోప్ ఉంది. ఆ స్కోప్ ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ట్రైలర్‌లో కనపడుతోంది. నిజమే ఒక కాఫీ షాప్‌లో ఇన్ని జరుగుతూ ఉంటాయి కాబోలు అని అర్థమైంది. చాలా ఎంటర్‌టైనింగ్‌గా ట్రైలర్ కనిపిస్తోంది. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఈ ట్రైలర్ చూశాక నాకు ఆర్.పి గారే హీరో అనిపించింది. ఎందుకంటే.. కథే హీరో కనుక ఆ కథను మలిచింది ఆయనే కనుక. ఆర్.పి ఏ క్రాఫ్ట్‌కు వెళ్ళినా సక్సెస్ ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆయనంటే నాకు ప్రత్యేకమైన అభిమానం.. ఎందుకంటే మేము టీనేజ్‌లో ఉన్నప్పుడు ఆయన కంపోజ్ చేసిన పాటలే ఎక్కువగా వినే వాళ్ళం. ఆ పాటలే లేకుంటే మా టీనేజ్ అంతా ఏమైపోయేదో.. మమ్మల్ని అంత ఇంప్రెస్ చేశాయి. ఇక ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరితో నా కెరీర్ మొదటి నుంచి కలిసి ట్రావెల్ చేశాను. ఫ్రెండ్స్ మధ్య ఉండి మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంది. అందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తూ.. టీమ్‌కి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘మొదట ఈ టైటిల్ చెప్పగానే ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ ఏంటి? కాఫీ విత్ కరణ్ లాగా అని అనుకున్నా.. బట్ ట్రైలర్ చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా, ఎంటర్టైనింగ్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా ఘన విజయం సాధించాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అన్నారు.  

దర్శకుడు ఆర్.పి పట్నాయక్ మాట్లాడుతూ.. ‘‘ఓటిటి వచ్చాక జనాలకు థియేటర్స్‌లో సినిమా చూడాలనే ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్తగా చెప్తే కానీ థియేటర్స్‌కు రప్పించలేము అనిపించే ఎంటర్‌టైనింగ్‌తో కూడిన థ్రిల్లర్ కథగా ఈ ‘కాఫీ విత్ ఎ కిల్లర్’ సినిమా కథను రాసుకొని.. డైరెక్ట్ చేయడం జరిగింది. అందుకు నా మరో తమ్ముడు సెవెన్‌హిల్స్ సతీష్ తోడై నిర్మాతగా వ్యవహరించాడు. సెట్‌లో తన ఆవేశాన్ని కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అయ్యింది( నవ్వుతూ). కానీ, సతీష్ అలా ఉండడం వల్లే ఈ సినిమా ఇక్కడి వరకు రాగలిగింది. ఇంకో రెండు సినిమాలు మా ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కాఫీ విత్ ఎ కిల్లర్ చిత్రానికి వస్తే.. ఆరిస్టులు అందరూ చాలా సపోర్ట్ చేసినా.. వారి వెంట వచ్చిన అసిస్టెంట్స్ వల్ల బాగా ఇబ్బంది పడ్డాము. అది కాకుండా అయితే ఇట్స్ ఎ టీం వర్క్ అని చెప్పాలి. ఈజీగా చేసే సినిమా మాత్రం కాదు అని చెప్పగలను. ఈ చిత్రంలో ఒక సీక్రెట్ కూడా ఉంది.. అది ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రివీల్ చేస్తాము. అందుకే ఆర్టిస్టులను ఎవర్నీ ఇక్కడికి తీసుకురాలేదు.  ఒక డిఫరెంట్ అండ్ న్యూ కాన్సెప్ట్‌ను ట్రై చేశాము. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇక మేము పిలవగానే తను ఎంతో బిజీగా ఉన్నా.. ట్రైలర్ లాంచ్ చేయడానికి వచ్చిన అనిల్ రావిపూడి‌కి కృతఙ్ఞతలు.. ఎందుకో ఆయనకు నేనంటే చాలా అభిమానం. అలాగే అభిషేక్ అగర్వాల్ కి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..’’ అన్నారు.

నిర్మాత సెవెన్‌హిల్స్ సతీష్ మాట్లాడుతూ.. ‘‘ఆర్.పి నాకు సొంత బ్రదర్ లాంటి వాడు. వాళ్ళ సొంత బ్రదర్స్ తనతో పాటు ఉంటారు.. నేను బయట తనతో తిరుగుతూ ఉంటాను అంతే. ఈ సినిమా లైన్ చెప్పగానే యాక్సెప్ట్ చేయాలనుకున్నా.. ఈ సినిమాలో ఒక చిన్నసర్‌ప్రైజ్ ఉంది.. త్వరలో రివీల్ చేస్తాము. ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్‌గా పనిచేసిన గౌతమ్ పట్నాయక్ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంతదాకా వచ్చేది కాదు. ఆర్ పి తో ఇంకో రెండు ప్రాజెక్ట్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో రఘు కుంచె, జెమినీ సురేష్, బెనర్జీ, రవి ప్రకాష్, గౌతమ్ పట్నాయక్, అనుష్, తిరుమల నాగ్, కృష్ణారెడ్డి,  తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, రవి బాబు, సత్యం రాజేష్, రఘు బాబు, జెమినీ సురేష్, రవి ప్రకాష్, టెంపర్ వంశీ, బెనర్జీ తదితరులు ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి క్రియేటివ్ హెడ్ : గౌతమ్ పట్నాయక్
డిఓపి,ఎడిటర్,డిఐ : అనుష్ గౌరక్
డైలాగ్స్ : తిరుమల నాగ్ 
పీఆర్వో : బి. వీరబాబు
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్
రైటర్, డైరెక్టర్ : ఆర్ పి పట్నాయక్