కోహెన్స్ ఆదాయం రూ.619 కోట్లు

కోహెన్స్ ఆదాయం రూ.619 కోట్లు

హైదరాబాద్​, వెలుగు: కోహెన్స్ లైఫ్‌‌‌‌‌‌‌‌    సైన్సెస్ లిమిటెడ్ (గతంలో సువెన్ ఫార్మా ) 2026లో కార్యకలాపాల ద్వారా రూ.2,268 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.  నాలుగో క్వార్టర్‌‌లో ఆదాయం రూ.619 కోట్లుగా ఉంది. గ్రాస్​ మార్జిన్లు 65.4 శాతానికి పెరిగాయి.  

ఎగ్జిక్యూటివ్ చైర్మన్, గ్రూప్ ఎండీ, సీఈఓ ఉమంగ్ వోహ్రా ఈ సందర్భంగా మాట్లాడుతూ కస్టమర్ల భాగస్వామ్యం, వ్యాపార విస్తరణపై దృష్టి పెడుతున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో కోహెన్స్ సామర్థ్యాలను, సైన్స్ సాంకేతికతను మరింత పెంచుతామని అన్నారు. 2027 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి పుంజుకుంటుందని ఆశాభావం ప్రకటించారు.