కొయిర్ బోర్డులో ఉద్యోగాలు..నెలకు 28వేల జీతం

కొయిర్ బోర్డులో ఉద్యోగాలు..నెలకు 28వేల జీతం

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం కొయిర్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జూన్​ 20.

పోస్టుల సంఖ్య: 22
సెంట్రల్ కొయిర్ రీసెర్చ్ ఇన్​ స్టిట్యూట్, 
అలప్పిలో ఖాళీలు
టెక్స్​టైల్ టెక్నాలజిస్ట్ ‌‌‌‌01, డిజైన్ అసిస్టెంట్01, ఫిట్టర్ 01, వెల్డర్ 01, మెషినిస్ట్ 01, ఎలక్ట్రీషియన్ 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్ అనలైటికల్ కెమిస్ట్ 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్(పాలిమర్ కెమిస్ట్రీ) 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్(ఎస్ఈసీ) 01, ప్రాజెక్ట్ హెల్పర్(ఎస్ఈసీ) 01, బైలర్ ఆపరేటర్ 01, ట్రైనర్/ ఇన్​స్ట్రక్టర్ 01, స్టోర్స్ అసిస్టెంట్ 01, లైబ్రేరియన్ 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్(జియోటెక్నికల్ ఇంజినీర్) 01.
సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్​ కొయిర్ టెక్నాలజీ బెంగళూరులో ఖాళీలు 
ఫిట్టర్ 01, వెల్డర్ 01, మెషినిస్ట్ 01, ఎలక్ట్రీషియన్ 01, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 01, ల్యాబ్ టెక్నీషియన్.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ, బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, డిప్లొమా, ఐటీఐ, ఎంఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా:
అప్లికేషన్లు ప్రారంభం: మే 09.
లాస్ట్ డేట్: జూన్ 20.
పూర్తి వివరాలకు www.coirboard.gov.in వెబ్ సైట్ లో సంప్రదించగలరు.