కర్ణాటక ధార్వాడ్ జిల్లా….కుమారేశ్వర్ నగర్ లో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. ఇప్పటి వరకూ 57 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. మరో 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుమారేశ్వర్ నగర్ లో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనం మంగళవారం ఒక్క సారిగా కుప్పకూలింది. భవనంలో పని చేస్తున్న సుమారు వంద మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. అయితే శిథిలాల తొలగింపు ఫైనల్ స్టేజ్ కు చేరుకుందన్నారు అధికారులు. ఆపరేషన్ మరో 72 గంటల్లు కొనసాగే అవకాశం ఉందన్నారు.
