ఉద్యోగమంటే తమాషాగా ఉందా ?... పనిచేయని సిబ్బందిని తొలగించండి

ఉద్యోగమంటే తమాషాగా ఉందా ?...  పనిచేయని సిబ్బందిని తొలగించండి
  • అధికారులపై కలెక్టర్  ఆగ్రహం 

సూర్యాపేట, వెలుగు:  జిల్లాలో ఇటీవల చేపట్టిన సడన్ విజిట్‌లను ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ వెంకట్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగం అంటే తమాషాగా ఉందా..? పనిచేయని సిబ్బందిని వెంటనే తొలగించాలని ఆదేశించారు.

 సోమవారం ప్రజావాణి అనంతరం నిర్వహించిన సమావేశంలో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. సడన్ విజిట్ రిపోర్డులను నేటికీ పరిశీలించని డీఈవో అశోక్‌పై మండిపడ్డారు. ప్రజావాణి ఫిటిషన్ల పై ఆరుగురు సభ్యులతో ఆడిట్ కమిటీ వేస్తామని చెప్పారు.  ఈ నెల 22 న గ్రీవెన్స్ అర్జీలపై అధికారులతో సమావేశం ఉంటుందని అందరూ పాల్గొనాలని ఆదేశించారు.

 ప్రజావాణికి గ్రామీణ, మండల స్థాయిలో అధికారులు పాల్గొనడం లేదని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి సూచించారు.  మీ సేవ సెంటర్లలో ప్రజల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వస్తే నిర్వాహకుల లాగిన్ లను నిలిపివేయాలని ఆదేశించారు. కొంతమంది ఆఫీసర్లు తమ పని తీరు మార్చుకోవాలని, లేదంటే ప్రభుత్వానికి రిపోర్ట్ అందిస్తామని హెచ్చరించారు.