
నిర్మల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లు నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని బంగల్ పేట్ ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మిస్తుందన్నారు. అనంతరం కలెక్టర్ నాగనాయిపేటలో నిర్మిస్తున్న ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.
నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. పార్కింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకో వాలన్నారు. మహిళాశక్తి భవనం భవిష్యత్లో అందరికీ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆమె వెంట పంచాయతీ రాజ్ ఈఈ చందుజాదవ్, డీఈ తుకారం రాథోడ్, ఏఈఈ చందన్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్లు ప్రభాకర్, రాజు, ఎంపీడీవో గజానన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు..
నిర్మల్ కలెక్టరేట్ లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను కలెక్టర్ అభిలాష అభినవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపాదించిన నమూనాలో తెలంగాణ తల్లి విగ్రహానికి రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోపు విగ్రహ నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆదేశించారు.