కేజీబీవీల్లో నాణ్యమైన విద్యనందించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

కేజీబీవీల్లో నాణ్యమైన విద్యనందించాలి :  కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: కేజీబీవీల్లో నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నిర్మల్ గ్రామీణ మండలం అనంతపేట్ విద్యాలయాన్ని ఆమె శుక్రవారం తనిఖీ చేశారు. స్టోర్‌ రూమ్, వంట గది, డైనింగ్‌ హాల్‌ను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థినులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకనుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయని ఇందుకోసం స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు.

 అనంతరం అడిషనల్​కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో బ్యాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడేందుకు వీలుగా పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇన్‌ చార్జి డీఈవో పరమేశ్వర్, ఎంఈవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో గజానన్, కేజీబీవీ ప్రత్యేక అధికారి శ్రీలత, టీచర్లు పాల్గొన్నారు.