గత ఏడాది కంటే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది? : కలెక్టర్ ఆదర్శ్ సురభి

గత ఏడాది కంటే విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గింది? : కలెక్టర్ ఆదర్శ్ సురభి
  • పెబ్బేరు హైస్కూల్​ నిర్వహణపై కలెక్టర్​ సీరియస్

పెబ్బేరు, వెలుగు: గత ఏడాది కంటే ఈ ఏడాది హైస్కూల్​లో స్టూడెంట్స్​ సంఖ్య తగ్గడంపై కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం పెబ్బేరు జడ్పీ హైస్కూల్​ను తనిఖీ చేశారు. బడిబాట కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే విద్యార్థుల సంఖ్య తగ్గిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెబ్బేరు పట్టణంలోని బీసీ బాయ్స్​ హాస్టల్లో సౌలతులు సరిగా లేక ఇతర గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు రావడం లేదని టీచర్స్​ చెప్పడంతో, ఆ ప్రాబ్లమ్​ సాల్వ్​ చేస్తాను. విద్యార్థుల సంఖ్య పెంచుతారా? అని ప్రశ్నించారు. స్కూల్​ నిర్వహణ సరిగా లేదని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.​ శుక్రవారం స్కూల్​కు హెచ్ఎం విష్ణువర్ధన్​ రాకపోవడంతో ఆయనకు మెమో జారీ చేయాలని ఆదేశించారు. టెన్త్​ విద్యార్థుల మ్యాథ్స్​ సామర్థ్యాన్ని పరిశీలించి, కరెక్ట్​ ఆన్సర్​ ఇచ్చిన వారిని అభినందించి నోట్​బుక్స్​ బహుమతిగా ఇచ్చారు. 

అనంతరం బీసీ బాయ్స్​ హాస్టల్​ను సందర్శించారు. అక్కడ టాయిలెట్స్, మరుగుదొడ్లు, నల్లాలు సరిగా లేకపోవడంతో, వాటిని బాగు చేయించేందుకు ఎస్టిమేషన్లు తయారు చేయాలని మున్సిపల్​ కమిషనర్​ ఖాజీ ఆరీఫుద్దీన్​ను ఆదేశించారు. హాస్టల్​ వార్డెన్​ అమృత్​సాగర్​ అందుబాటులో లేకపోవడంతో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఈవో అబ్దుల్​ గని, తహసీల్దార్​ మురళీ గౌడ్, ఎంఈవో జయరాములు, ఇన్​చార్జి ఎంపీడీవో రోజారెడ్డి, ఆర్ఐ రాఘవేందర్​ పాల్గొన్నారు.