
వనపర్తి టౌన్, వెలుగు: ఈ నెల 22 నుంచి జరగనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐడీవోసీలో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 29 వరకు జరిగే పరీక్షలకు 3,631 మంది ఫస్ట్ ఇయర్, 2,092 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్లతో కలుపుకొని 5,723 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, పరీక్షల టైమ్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఆర్టీసీ బస్సులు నడపాలని అధికారులకు సూచించారు.
పరీక్ష కేంద్రాల్లో సౌలతులతో పాటు ప్రథమ చికిత్స కిట్లతో ఏఎన్ఎం, ఆశా వర్కర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సెంటర్ల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయాలని, జిరాక్స్ సెంటర్లు మూసి వేయించాలని సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, సెంటర్లోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లవద్దని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు జి వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డీఐఈవో అంజయ్య పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ జూనియర్ కాలేజీలో లెక్చరర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్, ముగ్గురు కస్టోడియన్ లతో పాటు డెక్ టీం పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ప్రభువర్దన్ రెడ్డి, సైదులు, మాధవి పాల్గొన్నారు.