
వనపర్తి, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, పరిష్కరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 66 ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు.ప్రజావాణి హాల్లో నషాముక్త్ భారత్ కార్యక్రమంపై కలెక్టర్సమీక్ష నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల జరిగే అనర్థాలపై యువతకు అవగాహన కల్పించాలని, విద్యాశాఖ అధికారులతోపాటు తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.
దరఖాస్తులను పెండింగ్ పెట్టొద్దు
నారాయణపేట : ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్ పెట్టొద్దని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం 28 ఫిర్యాదులు వచ్చాయన్నారు. జడ్పీ సీఈవో శైలేశ్ పాల్గొన్నారు.
పెరుగుతున్న ఫిర్యాదులు
గద్వాల : ప్రతీ సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సోమవారం 75 వచ్చినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజల సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్కలెక్టర్ అమరేందర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణికి 37 దరఖాస్తులు వచ్చాయన్నారు.
పోలీస్ ప్రజావాణికి 7 ఫిర్యాదులు
వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లా పోలీస్కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీస్ ప్రజావాణి కార్యక్రమానికి ఏడుగురు బాధితులు వచ్చి, భూమి, కుటుంబ సమస్యలను ఎస్పీ గిరిధర్ కు ఏకరువు పెట్టారు. స్పందించిన ఆయన ఈ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలి
పాలమూరు, వెలుగు: పోలీస్స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా నడుచుకోవాలని ఎస్పీ జానకి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 14 మంది బాధితులు తమ సమస్యలపై ఫిర్యాదు చేశారని తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు తదితరులున్నారు.