ఎన్నికల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

ఎన్నికల నిర్వహణలో లోపాలు లేకుండా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
  •     కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్

కామారెడ్డిటౌన్​, వెలుగు : ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని స్ర్టాంగ్ రూమ్​ను ఎన్నికల జిల్లా అబ్జర్వర్​ సత్యానారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఫస్ట్ విడత ఎన్నికలు జరిగే మండలాలకు పంపిణీ చేస్తున్న బ్యాలెట్ పేపర్లు, భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు.   జడ్పీ సీఈవో చందర్,  నోడల్ అధికారి వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. 

ఎన్నికల నిబంధనలు అమలు చేయాలి 

ఎన్నికల ప్రవర్తన నియామవళిని పక్కగా అమలు చేయాలని  జిల్లా ఉన్నతాధికారులకు రాష్ర్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. గురువారం  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో రివ్యూ చేశారు. పోలింగ్ అధికారుల నియమాకం,  ట్రైనింగ్​లు తదితర ఆంశాలపై సూచనలు చేశారు. అడిషనల్ కలెక్టర్ మదన్మోహన్​, డీపీవో మురళి,  ఆర్డీవో వీణ  పాల్గొన్నారు.