
కామారెడ్డి, వెలుగు : గర్భిణులు, బాలింతలకు పోషకాహారం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడీ సిబ్బందికి సూచించారు. గురువారం కలెక్టరేట్లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషక మాసం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మనం తీసుకునే ఆహారంలో చక్కెర, అయిల్, ఉప్పు తగ్గించాలన్నారు. అంగన్వాడీల్లో నిర్వహించే సామాజిక వేడుకలను మరింత బలోపేతం చేయాలన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి నాగరాణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతల్లో రక్తహీనత లోపాన్ని తగ్గించేందుకు పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. సాముహిక సీమంతాలు, అన్న ప్రాసన నిర్వహించారు. ఆరోగ్య లక్ష్మిలో రెగ్యులర్ అటెండెన్స్ ఉన్న గర్భిణులు, నార్మల్ డెలివరీ అయిన వారికి కలెక్టర్ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఐసీడీఎస్ జిల్లా అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
కాలేజీల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డిలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు వివిధ వంటకాలను ప్రదర్శించారు. ఆర్కే డిగ్రీ కాలేజీలో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ లో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.