వర్షాకాలానికి ముందే డ్యామ్​ రిపేర్లు పూర్తి చేయాలి : ఆశిశ్​ సంగ్వాన్

వర్షాకాలానికి ముందే డ్యామ్​ రిపేర్లు పూర్తి చేయాలి : ఆశిశ్​ సంగ్వాన్

కడెం,వెలుగు :  కడెం ప్రాజెక్టు గేట్లకు రిపేర్లు పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిశ్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం కడెం ప్రాజెక్టును ఇంజినీరింగ్ అధికారులతో కలిసి  సందర్శించారు.    వర్షాకాలనికి ముందే  పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.  అనంతరం కడెం మండల కేంద్రంలోని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల   యూనిఫామ్​  తయారీ పనులను  పరిశీలించారు.  

ఆతర్వాత కడెం మండలంలోని లింగాపూర్ లో   ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని  తనిఖీ చేశారు.   రైతులు ధాన్యాన్ని త్వరగా అమ్మేలా ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.   లారీలు, కూలీలను అందుబాటులో ఉంచాలన్నారు.  అక్కడి నుంచి సారంగాపూర్ వెళ్లి  అమ్మ ఆదర్శ పాఠశాల  పనులను పరిశీలించారు.ఆయన వెంట  డీఈఓ రవీందర్ రెడ్డి, డీఆర్డీఓ ఓ విజయలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య ఉన్నారు.