
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : వర్షాల వల్ల ప్రజలకు ముప్పు వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కామారెడ్డిలో వర్షం కురువగా, వివిధ ప్రాంతాలతోపాటు గతంలో ముంపుకు గురైన జీఆర్ కాలనీ వద్ద బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించాలన్నారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలు, ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులను గుర్తించి, ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని, కంట్రోల్ రూమ్‌కు 08468-220069 నంబరులో సమాచారం అందించాలని సూచించారు. కలెక్టర్‌వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నారు.