కామారెడ్డిటౌన్, వెలుగు : ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇండ్ల మార్కవుట్, పంచాయతీ సెక్రటరీల హాజరు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల మార్కవుట్ పక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎలాంటి లోపాలకు తావులేకుండా గడువులోగా పూర్తి చేయాలన్నారు. పంచాయతీ సెక్రటరీల హాజరు వ్యవస్థను కచ్చితంగా అమలు చేయాలని, రోజు వారీ హాజరు వారీ అటెండెన్స్ అధికారులు పరిశీలించాలన్నారు. డీపీవో మురళీ, జిల్లా హౌజింగ్ పీడీ జయపాల్రెడ్డి, డీఎల్పీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇసుక లభ్యతపై అధికారుల కమిటీ చర్చ
జిలాస్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన జరిగింది. ఇసుక, చిన్న ఖనిజాలపై సర్వే రిపోర్టు, ఆమోదం, ఇసుక, ఖనిజాల అక్రమ రవాణా నిరోధనపై చర్చించారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు ముఖ్యమైన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. మాగి, అచ్చంపేట, ఇసుక లభ్యతను చర్చించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సబ్ కలెక్టర్కిరణ్మయి, మైనింగ్ జిల్లా అధికారి నగేశ్, భూగర్భజల అధికారి సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
