సీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే చర్యలు : ఆశిష్ సంగ్వాన్​

సీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే చర్యలు : ఆశిష్ సంగ్వాన్​

కామారెడ్డి​, వెలుగు : మిల్లర్లు సీఎంఆర్ కంప్లీట్ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్​లో  సీఎంఆర్​పై అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన మీటింగ్​లో మాట్లాడారు. వానాకాలం సీజన్​ సీఎంఆర్​ కంప్లీట్​ చేసేందుకు జూలై 27 గడువు ఉందన్నారు. బ్యాంక్​ గ్యారంటీలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్,  సివిల్​ సప్లయ్​ డీఎం రాజేందర్, డీఎస్​వో మల్లికార్జునబాబు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.  

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి 

ప్లాస్టిక్​ వాడటాన్ని తగ్గించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ పేర్కొన్నారు.  గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని జిల్లా కేంద్రంలోని మార్కెట్​లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్టాస్టిక్ బ్యాగ్​లకు బదులుగా జ్యూట్​ బ్యాగులు వినియోగించాలన్నారు.  అడిషనల్​ కలెక్టర్​ చందర్​నాయక్​,  మున్సిపల్ కమిషనర్​ రాజేందర్​రెడ్డి,  జిల్లా సైన్స్​ ప్రోగ్రాం, నేషనల్​ గ్రీన్​ కోర్​ కన్వీనర్ సిద్దిరాంరెడ్డి  పాల్గొన్నారు. 

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సదాశివనగర్​, వెలుగు:  ప్రభుత్వ  పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్​ ఆశిష్ సంగ్వాన్​ అన్నారు. గురువారం మండలంలోని యాచారం, వజ్జపల్లి తండాలో అభివృద్ధి పనుల పరిశీలనతోపాటు యాచారంలోని  రెవెన్యూ సదస్సును సందర్శించారు. ‘భూభారతి’ ద్వారా పక్కా భూ పట్టా అందించనున్నట్లు తెలిపారు. యాచారంలో రేషన్​ బియ్యం పంపిణీ ని పరిశీలించారు. వజ్జపల్లి తండాలో పశువుల షెడ్, పాం పాండ్​ నర్సరీ, ప్రకృతి వనాన్ని సందర్శించి మొక్కలు నాటారు. 

మొక్కలను కాపాడుతున్న వజ్జపల్లి తండా పంచాయతీ సెక్రటరీ పాపిరెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సతీష్​యాదవ్, ఆర్డీవో వీణా, హాసింగ్ పీడీ విజయ పాల్ రెడ్డి, సివిల్ సప్లయ్​అధికారి మల్లికార్ణున్, ఎంపీడీవో సంతోష్​కుమార్​, తహసీల్దార్ సత్యనారయణ, ఎంపీవో సురేందర్ రెడ్డి, ఎంఈవో యోసెఫ్, ఏపీఎం రాజిరెడ్డి, ఏపీవో శ్రీనివాస్​, ఏఈ సుచిత్ర, గ్రామస్తులు పాల్గొన్నారు.