జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాల జిల్లాలో వరి, మక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల పురోగతి, ధాన్యం నిల్వలు, రవాణా, హమాలీలు, గన్నీ బ్యాగుల సరఫరా తదితర అంశాలపై అధికారులను సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వస్తున్న వడ్లను ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం లిఫ్టింగ్ ప్రక్రియను వేగవంతం చేసి గోదాములకు వెంటనే తరలించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 12 ప్రత్యేక మక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మరో రెండు వారాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు.
