సీఎంఆర్​లో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు : బదావత్ సంతోష్

సీఎంఆర్​లో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసులు : బదావత్ సంతోష్

నస్పూర్, వెలుగు: జిల్లాలోని రైస్​ మిల్లులకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను సాధించడంలో నిర్లక్ష్యం వహిస్తే క్రిమినల్ కేసుల నమోదుతో పాటు మిల్లలను సీజ్ చేస్తామని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ హెచ్చరించారు. మంగళవారం నస్పూర్​లోని కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ సబావత్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్​తో కలిసి రైస్​మిల్లర్ల సంఘం నాయకులతో సీఎంఆర్ లక్ష్యాల సాధనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్ర వరి నెలాఖరుకల్లా లక్ష్యాలు పూర్తి చేయని రైస్ మిల్లర్లపై చర్యలతో పాటు వారికి కేటియించిన ధాన్నాన్ని వేరే మిల్లులకు కేటాయిస్తామని స్పష్టం చేశారు.

పోషకాహార పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలి

జైపూర్: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహార పంపిణీ పకడ్బందీగా నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మంగళవారం జైపూర్ మండలంలోని జైపూర్-1, దుబ్బపల్లి అంగన్వాడీ కేంద్రాలను జిల్లా స్త్రీ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ అధికారి కె.చిన్నయ్య, తహసీల్దార్ రమేశ్​ బాబుతో  కలిసి ఆకస్మిక తనిఖీ చేసి రిజిస్ట ర్లను పరిశీలించారు.