అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి : కలెక్టర్  బదావత్  సంతోష్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలని కలెక్టర్  బదావత్  సంతోష్  అధికారులను ఆదేశించారు. బుధవారం మున్సిపాలిటీలో ప్రజాపాలన సేవా కేంద్రాన్ని సందర్శించారు. ప్రజల నుంచి సేకరిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేవా కేంద్రంలో లబ్ధిదారుల అందించిన దరఖాస్తులను పరిశీలించారు. మున్సిపల్  చైర్​పర్సన్, కమిషనర్​తో సమావేశం నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీకి వచ్చిన కలెక్టర్ ను మున్సిపల్  చైర్​పర్సన్​ కల్పన, కమిషనర్  నరేశ్ బాబు సన్మానించారు.

సీజనల్  వ్యాధులపై అలర్ట్​గా ఉండాలి

సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని  కలెక్టర్  బదావత్  సంతోష్  సూచించారు. కలెక్టరేట్  మీటింగ్  హాల్​లో మలేరియా, ఫైలేరియా అడిషనల్​  డైరెక్టర్  అమర్ సింగ్ తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్, రూరల్ వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఫిషరీస్, సోషల్  వెల్ఫేర్, ట్రైబల్  వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, విద్యాశాఖ, డీఆర్డీఏ, మున్సిపల్  శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పైప్​ లైన్​ లీకేజీలకు రిపేర్లు చేయించి, శుభ్రమైన తాగునీటిని సప్లై చేయాలని సూచించారు. సీజనల్  వ్యాధులపై కంట్రోల్​రూమ్( 98667-56825)కు సమాచారం అందించాలని సూచించారు.