చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి 

చెరువులకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : కలెక్టర్ సి.నారాయణరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : వర్షాకాలం చెరువులు, కుంటలకు గండ్లు పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ఆర్డీవోలు, ఇరిగేషన్ అధికారులతో ఆయన సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా వర్షం నీటికి తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలను గుర్తించి వాటికి మరమ్మతులు చేయాలన్నారు.

ఒండ్రు మట్టి, మొరం, ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని, మట్టి విషయంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా వచ్చే శుక్రవారం నాటికి అన్ని  స్థలాలకు కంచె ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయా ప్రాజెక్టుల కింద రిజర్వాయర్ల వారీగా భూసేకరణ పీఎన్, పీడీ తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సమీక్షలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్,స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఎఫ్ వో రాజశేఖర్, ఎస్ఎల్బీసీ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీనివాస్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఇంజినీర్లు, ఏఈలు,ఆర్డీవోలు పాల్గొన్నారు.