హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా గోపాలపూర్ ఊర చెరువు పై నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్, బల్దియా ఇన్చార్జి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం గోపాలపూర్ ఊర చెరువు వద్ద ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
ఊర చెరువు డీసిల్టేషన్ టెండర్లు పూర్తయిన నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభించి, వర్షాకాలం ప్రారంభానికి ముందే చెరువును పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని సూచించారు. ఊర చెరువు సమీపంలో “వేస్ట్ టు ఆర్ట్” కార్యక్రమంలో భాగంగా చెత్త వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు.
