మేడారం మహాజాతరను విజయవంతం చేయాలి : కలెక్టర్ దివాకర

మేడారం మహాజాతరను  విజయవంతం చేయాలి :  కలెక్టర్ దివాకర

తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతరను అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, జాతర నిర్వహణలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం తాడ్వాయి మండలం మేడారం హరిత హోటల్ లో ఆయన ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్, అడిషనల్​ కలెక్టర్లు సీహెచ్ మహేందర్ జీ, సంపత్ రావుతో కలిసి జోనల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మేడారం జాతర విజయవంతం చేయడంలో జోనల్ అధికారుల పాత్ర కీలకమని, జోనల్ అధికారులు సెక్టర్ అధికారులతో కలిసి తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేయాలని సూచించారు. జోనల్, సెక్టార్, వివిధ శాఖల అధికారులకు మూడు రోజులు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మూడు షిఫ్టులవారీగా అధికారులు విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, డీఎస్స్పీ రవీందర్, ఆఫీసర్లు తదితరులు  పాల్గొన్నారు.