61 కేంద్రాల్లో ఇంటర్​ప్రాక్టికల్​ ఎగ్జామ్స్ : కలెక్టర్​ ప్రియాంక అల

61 కేంద్రాల్లో ఇంటర్​ప్రాక్టికల్​ ఎగ్జామ్స్ : కలెక్టర్​ ప్రియాంక అల
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అల 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇంటర్మీడియట్​ ప్రాక్టికల్​ఎగ్జామ్స్​ 61 కేంద్రాల్లో జరుగనున్నాయని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు.  ఆమె మీడియాతో మాట్లాడుతూ  గురువారం నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్​ స్టార్ట్ ​కానున్నాయని చెప్పారు.  ఈనెల15 వరకు ఎగ్జామ్స్​ కొనసాగనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్స్​ జరుగుతాయని చెప్పారు. ఫస్ట్​ ఇయర్​లో 2,433 మంది, సెకండ్​ ఇయర్​లో 5,893 మంది స్టూడెంట్స్​ ఎగ్జామ్స్​కు అటెండ్​ కానున్నారని తెలిపారు.

సెకండ్​ ఇయర్​ ఒకేషనల్​ స్టూడెంట్స్​ 1,935 మంది హాజరు కానున్నారని చెప్పారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశామన్నారు. కమిటీలో జిల్లా ఇంటర్మీడియట్​ నోడల్​ అధికారి సులోచనా రాణి, మణుగూరు గవర్నమెంట్​ కాలేజ్​ ప్రిన్సిపల్​ ఎస్డీ యూసుఫ్​,  అశ్వాపురం గవర్నమెంట్​ జూనియర్​ కాలేజ్​ లెక్చరర్​ సుధాకర్​రెడ్డి ఉన్నారని తెలిపారు.

ఇంటర్ ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్స్​కు పర్యావరణ పరీక్షను ఈ నెల 19న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎగ్జామ్స్​ అంటే ఒత్తిడి లేకుండా రాష్ట్ర స్థాయిలో 14416 టోల్​ ఫ్రీ నంబర్​ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్టూడెంట్స్​కు ఇబ్బంది లేకుండా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు నడపాలని కోరారు. కరెంట్​ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్​ శాఖాధికారులను ఆదేశించారు. 

సర్పంచ్​ల పదవీ కాలం ముగింపు

సర్పంచ్​ల పదవీ కాలం గురువారం సాయంత్రం 5గంటల లోపు ముగుస్తుందని కలెక్టర్​తెలిపారు. సర్పంచ్​ల వద్ద డిజిటల్​ కీతో పాటు రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఎంపీడీఓలు, ఎంపీవోలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్​లో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 481 గ్రామ పంచాయతీలలో ప్రత్యేక అధికారుల నియామకానికి కసరత్తు చేస్తున్నామన్నారు.