గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆఫీసర్లు తప్పనిసరిగా హాజరుకావాలి ; కలెక్టర్ గరిమ అగ్రవాల్

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆఫీసర్లు తప్పనిసరిగా హాజరుకావాలి ; కలెక్టర్ గరిమ అగ్రవాల్
  • ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఆఫీసర్లు తప్పనిసరిగా హాజరుకావాలని రాజన్నసిరిసిల్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె ప్రజావాణిలో పాల్గొని 149  దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత ఆఫీసర్లు పరిశీలించి  పరిష్కరించాలన్నారు. 

  ఎస్పీ ఆఫీసులో నిర్వహించిన ప్రజాదివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎస్పీ మహేశ్ బి.గీతే 23 దరఖాస్తులు స్వీకరించారు. అర్జీలను వెంటనే పరిష్కరించాలని పోలీస్ ఆఫీసర్లను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్ నగేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీవో శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత పాల్గొన్నారు.

జగిత్యాల టౌన్, వెలుగు: బాధితుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ఆఫీసులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.