- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
వేములవాడ, వెలుగు: రాజన్న ఆలయ అభివృద్ది పనులను స్పీడప్ చేయాలని రాజన్నసిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ---వీటీఏడీఏ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో చేపడుతున్న అభివృద్ధి, విస్తరణ పనులను ఆమె సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చేపట్టిన పనులను ఆలయ, ఆర్అండ్ బీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రచార రథం, ఆలయం ముందు రోడ్లు వైడెనింగ్, బద్దిపోచమ్మ ఆలయ విస్తరణ పనులను పరిశీలించారు. అంతకుముందు వేములవాడ గుడిచెరువు బండ్‌ను పరిశీలించారు. బండ్ నిర్మాణ పనులపై ఆరాతీశారు. కలెక్టర్ వెంట ఈవో రమాదేవి, ఆర్డీఓ రాధాబాయి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహచారి, వీటీఏడీఏ సీపీవో అన్సారీ, ఇరిగేషన్ ఈఈ కిషోర్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
