చేర్యాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల, వెలుగు: చేర్యాల మండలంలోని ముస్త్యాల పీహెచ్​సీని, తెలంగాణ మోడల్​స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముస్త్యాల పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలో అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశారు.  ఓపీ రిజిస్టర్ చెక్ చేస్తూ ఎక్కువ ఎలాంటి కేసులు వస్తున్నాయి, ఎంతమంది వస్తారనే వివరాలను ఆరా తీశారు.  మెడిసిన్ అందుబాటులో ఉన్నాయా సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.  ల్యాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేసే టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు టీహబ్ కి పంపించే టెస్ట్ ల వివరాలను ఆరా తీశారు. 

 ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని మెడికల్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు.  తెలంగాణ మోడల్ స్కూల్ వాతావరణం బాగుందని తెలిపారు.  స్కూల్ పైభాగం నుంచి స్లాబ్ నుంచి నీరు కారుతుందని ఉపాధ్యాయులు తెలుపగా బిల్డింగ్ పైకి ఎక్కి చూశారు. దాబాపై చెత్తాచెదారం లేకుండా చూడాలన్నారు.  ప్రణాళిక ప్రకారం సిలబస్ పూర్తి చేయాలని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట తహసీల్దార్ దిలీప్ కుమార్ ఇతర ఆఫీసర్లు ఉన్నారు. 

ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ కె.హైమావతి అధికారులకు సూచించారు. చిన్నకోడూరు మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లపై నీరు చేరగా పలు ప్రాంతాలను కలెక్టర్ బుధవారం పరిశీలించారు.

 చిన్న కోడూరులోని బ్రాహ్మణ చెరువు మత్తడి పైనుంచి నీరు ప్రవహిస్తుండడంతో జాగ్రత్తగా ఉండాలని, నీటి ఉధృతి పెరిగితే రాకపోకలు నిలిపివేయాలని సూచించారు. చిన్నకోడూరు వద్ద ఉన్న రైల్వే బ్రిడ్జి కింద అండర్ పాస్ లో పూర్తిగా నీట మునిగిన ప్రాంతాన్ని పరిశీలించి, నీరు పూర్తిగా వెళ్లే వరకు రాకపోకలు నిలిపివేయాలని, బ్రిడ్జి పక్కన తాత్కాలికంగా బీటీ రోడ్ వెయ్యాలని రైల్వే అధికారులను ఆదేశించారు.