పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ హైమావతి

పెండింగ్ పనులను త్వరగా పూర్తిచేయాలి : కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలోని ఆయా గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్​హైమావతి సూచించారు. బుధవారం సిద్దిపేట కలెక్టరేట్ లో ఎంజీఎన్ఆర్ఈజీఎస్​కింద చేపట్టిన ప్రభుత్వ బిల్డింగ్​ల నిర్మాణ పనులపై అధికారులతో సమావేశం నిర్వహంచారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవనాల కోసం స్థల కొరత గల గ్రామాల్లో సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలతో సమావేశం నిర్వహించి స్థల అన్వేషణ చేయాలని డీపీవోను ఆదేశించారు.

 నిర్మాణంలో ఉన్న పనులు ఫిబ్రవరి 15 వరకు పూర్తిచేయాలని ఆదేశించారు. స్థలం దొరకని గ్రామాల్లో పనులను రద్దు చేయాలన్నారు. అనంతరం జిల్లాస్థాయి ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులతో  సమావేశం నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఆహార వ్యాపారులు అనుమతులు పొందాలన్నారు.  అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్టీవో రామ్మూర్తి, అధికారులు అమృతశ్రీ, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, డీఎంహెచ్ వో ధనరాజ్, డీపీవో రవీందర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జయరాం పాల్గొన్నారు.