వాగులను నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్ హైమావతి

వాగులను నిరంతరం పర్యవేక్షించాలి :  కలెక్టర్ హైమావతి
  • కలెక్టర్​ హైమావతి

సిద్దిపేట రూరల్, కోహెడ, వెలుగు: వాగులు, చెరువుల్లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. ఆదివారం నంగునూరు, కోహెడ, చిన్నకోడూరు మండలాల్లో పర్యటించి  లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్ వేల వద్ద  నీటి ప్రవాహాలను ఆర్ అండ్ బీ డీఈ వెంకటేశ్ తో కలిసి  పరిశీలించారు.

 ముందుగా నంగునూరు మండలంలోని అక్కినేపల్లి వద్ద మోయతుమ్మెదవాగు పై లెవెల్ బ్రిడ్జిని, బద్దిపడగ వద్ద ఊర చెరువు మత్తడి కింద రోడ్,  కోహెడ మండలం  గుండారెడ్డిపల్లి వద్ద నక్కవాగు, తంగళ్లపల్లి వద్ద  పిల్లివాగు వాగు, చిన్న కొండూరు మండలం సికింద్లాపూర్,  ఇబ్రహీంనగర్ నగర్ల వద్ద గల స్థానిక వాగుల పై గల లోలెవల్ కాజ్ వేలను పరిశీలించారు.