పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ హైమావతి

పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి : కలెక్టర్ హైమావతి
  • కలెక్టర్ హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు: నంగునూరు మండలంలోని నర్మెట్టలో రూ.300 కోట్లతో నిర్మించిన పామాయిల్​ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని, త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుందని కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం నర్మెట్టలో ఉన్న ఫ్యాక్టరీని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టెంపరరీ హెలిప్యాడ్ నిర్మించాలని, ముండ్రాయి నుంచి నంగునూరు వరకు రోడ్డుకు ఇరువైపులా చెట్ల పొదలను తొలగించి క్లియర్ చేయాలని, ఫ్యాక్టరీ అప్రోచ్ రోడ్డు, ఫ్యాక్టరీ లోపల రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. 

 కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్​, జిల్లా హార్టికల్చర్​ఆఫీసర్​సువర్ణ, ఆయిల్ ఫెడ్ మేనేజర్  సుధాకర్ రెడ్డి, పామ్ ఆయిల్ మేనేజర్ శ్రీకాంత్, డీఏవో స్వరూపారాణి పాల్గొన్నారు. అంతకుముందు అర్బన్ మండలం కేసీఆర్ నగర్ లోని బస్తీ దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్, లీవ్ లెటర్లను వెరిఫై చేశారు. డ్యూటీ డాక్టర్ గైర్హాజరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్​వోకు సూచించారు.  

ఇంజనీరింగ్​ కాలేజీలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం

కోహెడ (హుస్నాబాద్): ఇంజనీరింగ్​కాలేజీలో అడ్మిషన్ పొందిన స్టూడెంట్స్​కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. హుస్నాబాద్​పాలిటెక్నిక్ కాలేజీ మొదటి అంతస్తులో కొనసాగుతున్నశాతవాహన ఇంజనీరింగ్ కాలేజీని కలెక్టర్ సందర్శించారు. కాలేజీలో చేస్తున్న ఏర్పాట్ల గురించి ప్రిన్సిపాల్​ను అడిగి తెలుసుకున్నారు. 

ఫస్ట్​విడత కౌన్సెలింగ్ లో ఇంజనీరింగ్ కాలేజీలో 160 మంది స్టూడెంట్స్​ జాయిన్ అయ్యారని, హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో చాలా మంది సెకండ్​ కౌన్సెలింగ్ లో వేరే కాలేజీకి వెళ్లారనీ,  ఇప్పటి వరకు ఫస్ట్​ఇయర్​ అన్ని బ్రాంచ్ లలో 91 అడ్మిషన్ తీసుకున్నారని, థర్డ్​విడత కౌన్సెలింగ్ లో కాలేజీలో హాస్టల్ పెడితే అడ్మిషన్ లు వస్తాయని ప్రిన్సిపాల్​కలెక్టర్​కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాయ్స్, గర్ల్స్​ వేర్వేరుగా తాత్కాలిక హాస్టల్ కు బిల్డింగ్​ చూడాలని తహసీల్దార్​కు సూచించారు. 

పాలిటెక్నిక్ కాలేజీలో స్టూడెంట్స్​కు నీటి కొరత లేకుండా చూసుకోవాలని మిషన్ భగీరథ డీఈని ఆదేశించారు. ఆమె వెంట పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ శ్రీదేవి, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ 
రవి కుమార్ ఉన్నారు.