ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించిన కలెక్టర్ హనుమంతరావు

యాదాద్రి, వెలుగు: దసరా పండుగకు గృహ ప్రవేశం చేసి పాలు పొంగిస్తామని కలెక్టర్ హనుమంతరావుకు పలువురు లబ్ధిదారులు తెలిపారు. ఆలేరు మండలం మందనపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలెక్టర్​ మాట్లాడారు. నిర్మాణ బిల్లులు వచ్చాయా... అని అడిగి తెలుసుకున్నారు. 

నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్​సూచించగా.. దసరా పండుగకు గృహ ప్రవేశం చేసుకొని పాలు పొంగిస్తామని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం గొలనుకొండలోని పల్లె దవాఖానను కలెక్టర్​ తనిఖీ చేశారు. ట్రీట్​మెంట్​కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్బిణీలకు రెగ్యులర్​గా చెకప్​ చేయాలని ఆయన ఆదేశించారు.