సీజనల్​ వ్యాధులపై స్పెషల్​ డ్రైవ్ ​చేపట్టాలి : కలెక్టర్ ​హనుమంతు 

సీజనల్​ వ్యాధులపై స్పెషల్​ డ్రైవ్ ​చేపట్టాలి : కలెక్టర్ ​హనుమంతు 

యాదాద్రి, వెలుగు : సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుధ్యంపై మున్సిపాలిటీల్లో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్​హనుమంతు జెండగే అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లార్వాను ప్రారంభ దశలోనే నిర్మూలించేందుకు ఆయిల్ బాల్స్, ఫాగ్గింగ్ చేయాలన్నారు.

మురుగు కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా చూడాలన్నారు. వన మహోత్సవంలో భాగంగా వివిధ శాఖలకు  కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను అధిగమించాలని చెప్పారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని, అర్బన్ ప్లాంటింగ్ కు సంబంధించి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించారు.

సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు బెన్ షాలోమ్, గంగాధర్, ఆర్డీవోలు అమరేందర్, శేఖర్ రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజారాణి, జడ్పీ సీఈవో శోభారాణి, డీఆర్డీవో ఎంఏ కృష్ణన్, డీఏవో  అనురాధ, డీపీవో సునంద, సీపీవో వెంకటేశ్వర్లు, డీఎంహెచ్​వో డాక్టర్ పాపారావు, వెల్ఫేర్​ ఆఫీసర్​కృష్ణవేణి, ఎక్సైజ్ ఎస్పీ సైదులు, పంచాయత్ రాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఎంవో సబిత, మున్సిపల్ కమిషనర్లు  తదితరులు పాల్గొన్నారు.