హాయ్..హలో..హౌ ఆర్యూ! .. కలెక్టరేట్ వాట్సాప్ ప్రజావాణికి 1,400 మెసేజ్లు

హాయ్..హలో..హౌ ఆర్యూ! .. కలెక్టరేట్ వాట్సాప్ ప్రజావాణికి  1,400 మెసేజ్లు
  • ఇందులో 25 మాత్రమే ఫిర్యాదులు
  • బల్దియాకు సంబంధించినవి 10 
  • ఫిర్యాదులు మాత్రమే చేయాలన్న కలెక్టర్ ​హరిచందన 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన వాట్సాప్ ప్రజావాణికి 1,400 మెసేజ్​లు వచ్చాయి. ఇందులో 25 మాత్రమే ఫిర్యాదులు కాగా,15 జిల్లాకి సంబంధించినవి, మరో 10 జీహెచ్ఎంసీకి సంబంధించిన కంప్లయింట్స్​ఉన్నాయి. ఇవి తప్ప మిగతా 1,375 మెసేజ్​లు ‘కంగ్రాట్స్​..హాయ్​.. హౌ ఆర్​యూ..థాంక్యూ’ అని వచ్చినవే కావడం గమనార్హం. దీనిపై స్పందించిన కలెక్టర్​హరిచందన మాట్లాడుతూ.. వాట్సాప్​ప్రజావాణికి తొలిరోజు అభినందిస్తూ చాలా మెసెజ్ లు వచ్చాయని, ఇకపై అటువంటి మెసెజ్ లు పంపకుండా కేవలం ఫిర్యాదులు మాత్రమే చేయాలని కోరారు. 

అనవసరమైన మెసేజ్​లు పంపవద్దని, దీనివల్ల నిజమైన ఫిర్యాదుదారుల సమస్యను గుర్తించడానికి ఆలస్యం అవుతుందన్నారు. వాట్సాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వీలైనంత తొందరగా పరిష్కరిస్తామన్నారు. అలాగే, కలెక్టరేట్ లో ప్రత్యక్షంగా నిర్వహించిన ప్రజావాణికి 162 ఫిర్యాదులు రాగా, అడిషనల్​కలెక్టర్ క‌‌‌‌దిర‌‌‌‌వ‌‌‌‌న్ ప‌‌‌‌ల‌‌‌‌న్ స్వీకరించారు.  ఇందిర్మ ఇండ్ల కోసం 62, రెవెన్యూకు సంబంధించినవి 30, పెన్షన్ల  కోసం 44, ఇతర ఫిర్యాదులు 26 వచ్చాయి. 

బల్దియా హెడ్డాఫీసుకు 66 

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజావాణికి 66 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అత్యధికంగా టౌన్ ప్లానింగ్ కు 32 ఫిర్యాదులు వచ్చాయి. ఫోన్​ఇన్ ద్వారా ముగ్గురు ఫిర్యాదు చేశారు. ఆరు జోన్లలో 93 కంప్లయింట్స్​వచ్చాయి. అడిషనల్ కమిషనర్లు పంకజ, గీతా రాధిక, సత్యనారాయణ, వేణు గోపాల్, మంగతాయారు పాల్గొన్నారు.

రంగారెడ్డిలో..

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​లోని కలెక్టరేట్​లో ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్, డీఆర్ఓ సంగీతతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా రెవెన్యూకు 32, ఇతర శాఖలకు - 44, ఫిర్యాదులు వచ్చాయి.