ములుగు జిల్లాలో నాలుగు రోజుల మేడారం సెలవులు : ఇలా త్రిపాఠి

ములుగు జిల్లాలో నాలుగు రోజుల మేడారం సెలవులు : ఇలా త్రిపాఠి
  • కలెక్టర్​ ఇలా త్రిపాఠి  ఉత్తర్వులు

ములుగు, వెలుగు : మేడారం మహాజాతర నేపథ్యంలో జిల్లాలో నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్​ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఈ నెల 21, 22, 24న  ఏజెన్సీ మండలాలకు లోకల్ హాలీడేస్​ ప్రకటించారు. ఈనెల 23న మేడారం సమ్మక్క, సారలమ్మల స్టేట్​ ఫెస్టివల్​ గా జిల్లా మొత్తం సెలవు ప్రకటించారు. నాలుగు రోజులపాటు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నామని వెల్లడించారు. అయితే 23వ రోజు సెలవు రోజుగా మార్చి 9న రెండో శనివారం వర్కింగ్​ డేగా నిర్ణయించారు.