
జనగామ, వెలుగు: జనగామ జిల్లా హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సిటీ స్కాన్ యంత్రాన్ని మంగళవారం వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఆస్పత్రిలో ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.
అంతకుముందు కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో అప్లికేషన్లను స్వీకరించారు. అనంతరం అధికారులతో రివ్యూ చేపట్టి యూరియా పంపిణీని సక్రమంగా చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకున్న 48 మంది సర్వేయర్లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఇదిలా ఉండగా, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ ఆధ్వర్యంలో రాష్ర్ట ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డితో కలిసి కలెక్టరేట్ఎదుట ఆందోళన చేపట్టి, అనంతరం కలెక్టర్‌కు పలు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.