భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో ముందంజ : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​​

భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇంకుడు గుంతల నిర్మాణంలో ముందంజ : కలెక్టర్ జితేశ్​ వి పాటిల్​​
  • దేశంలోనే జిల్లా మొదటి స్థానానికి చేరువలో ఉంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఇంకుడు గుంతల నిర్మాణంలో దేశంలోనే మొదటి స్థానానికి చేరువులో భద్రాద్రికొత్తగూడెం జిల్లా చేరువలో ఉందని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్​ నుంచి పలు శాఖల ఆఫీసర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్​ నిర్వహించారు. ఇంకుడు గుంతల నిర్మాణంలో జిల్లా మొదటి స్థానంలో వస్తే రూ. 2కోట్లు బహుమతి వస్తుందని తెలిపారు. ప్రతీ ఇంకుడు గుంత ఫొటోను జేఎస్​జీబీ పోర్టల్​లో అప్ లోడ్​ చేయాలని సూచించారు.

 ఫారం పాండ్స్​ నిర్మాణాలు ఎక్కువగా చేపడుతున్నట్లు తెలిపారు. రాజీవ్​ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు దారుల సిబిల్​ స్కోర్​ ఆధారంగా అర్హుల ఎంపిక చేయాలని చెప్పారు. ఈ నెల 21 నుంచి 30 వరకు జిల్లా స్థాయి కమిటీ పరిశీలన తర్వాత అర్హులైన జూన్​ 2న సాంక్షన్​ ఆర్డర్స్​ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక స్పీడప్​ చేయాలని చెప్పారు.