గురుకులాల్లో వసతులు మెరుగుపరచాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

గురుకులాల్లో వసతులు మెరుగుపరచాలి : కలెక్టర్ ఖుష్బూ గుప్తా

హన్వాడ, వెలుగు :  మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలోని పెద్దధర్పల్లి స్టేజి వద్ద గల మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలను మంగళవారం కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏడవ తరగతి విద్యార్థినులతో మాట్లాడి క్రమశిక్షణతో చదివి భవిష్యత్​లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వేసవి దృష్ట్యా డార్మిటరీలలో అదనపు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వేపూర్ బీసీ  సంక్షేమ గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థినులతో మాట్లాడుతూ ఎస్ఎస్సీ పరీక్షలను ఆత్మవిశ్వాసంతో రాయాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి ఆమె భోజనం చేశారు.