మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ గా ఆర్డీవో శ్రీనివాస్ రావు

మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ గా ఆర్డీవో శ్రీనివాస్ రావు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా ఆర్డీవో శ్రీనివాస్ రావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆర్డర్స్ జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు అయన అడిషనల్​కలెక్టర్​గా కొనసాగుతారని ఓ ప్రకటనలో తెలిపారు. 

గతంలో అడిషనల్ కలెక్టర్ గా పనిచేసిన మోతీలాల్ మే 31న రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పోస్టులో ఎవరినీ నియమించలేదు. అప్పటినుంచి కలెక్టర్ అదనపు బాధ్యతలు నిర్వహించారు.